Share News

Mancherial: ఉప్పొంగిన ప్రాణహిత.. నీట మునిగిన పంటలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:00 PM

కోటపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కురు స్తున్న భారీవర్షాలతోపాటు ఎగువప్రాంతం నుంచి వస్తున్న వరదతో మండలానికి ఆను కుని ప్రవహిస్తున్న ప్రాణహితనది తీవ్ర రూపం దాల్చింది.

Mancherial:  ఉప్పొంగిన ప్రాణహిత.. నీట మునిగిన పంటలు

కోటపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కురు స్తున్న భారీవర్షాలతోపాటు ఎగువప్రాంతం నుంచి వస్తున్న వరదతో మండలానికి ఆను కుని ప్రవహిస్తున్న ప్రాణహితనది తీవ్ర రూపం దాల్చింది. ప్రాణహిత ఉప్పొంగ డంతో జనగామ, వెంచపల్లి,సిర్సా, సూపాక, అర్జునగుట్ట, రాపనపల్లి,దేవులవాడ, అన్నా రం, పుల్లగామ తదితర గ్రామాల్లోని పత్తి చేన్లు నీటమునిగాయి. ఒక్క కోటపల్లి మండలంలోనే 600ఎకరాల పంటలు నీట మునిగినట్లు ప్రాథమిక సమాచారం. శుక్ర వారం సాయంత్రం వరకు కూడా ప్రవా హం పెరుగుతూనే ఉందని సమీప గ్రామా ల రైతులు పేర్కొన్నారు. గోదావరి, ప్రాణ హితనదులు కలిసే దేవులవాడప్రాంతం సముద్రాన్ని తలపిస్తున్నది. దీంతో పంట చేన్లన్నీ నీటిలోనే మునిగి ఉన్నాయి. మొక్క దశలోనే నీరుచేరడంతోనే తీవ్రనష్టం వాటి ల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పొలాల్లో ఇసుక మేటలు..

హాజీపూర్‌ : నాలుగురోజులుగా కురు స్తున్న వర్షాలతో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. హాజీపూర్‌ మండ లంలోని గుడిపేటలో చెరువు మత్తడినుంచి భారీగా వరదపోటు రావడంతో దిగువనఉన్న పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. ఒర్రెలు అలుగు పారుతుండడంతో కట్టలు తెగి పక్కన పంటపొలాలను ముంచెత్తాయి. ఎకరాల మేర నాట్లువేసిన వరిపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రైతులు తీవ్రంగా నష్ట పోయారు. మూడుఎకరాల్లో వరినాట్లువేసి వారం అవు తుందని, ఎరువులు కూడా చల్లానని, ఇప్పుడు పొలం మొత్తం ఇసుకమేటలు వేసిందని రైతు ముత్యాల శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

వర్షం నీటితో

నిండిన పొలాలు

మందమర్రిరూరల్‌ : రెండురోజుల పాటు కురిసిన వర్షానికి మండలంలోని గ్రామాల్లోని పొలాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. కొన్ని పొలాల్లో ఇసుక మేటలు వేసింది. శుక్ర వారం వర్షం తగ్గినప్పటికీ నీరుమాత్రం పొలాల్లో నిలిచిపోయింది. దీంతో రైతులు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారంగపల్లిలోని చెరువు నిండుకుండలా మారింది.

Updated Date - Jul 31 , 2026 | 11:00 PM