Share News

Mancherial: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:50 PM

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమం లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించా లని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సూచిం చారు.

 Mancherial:   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమం లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించా లని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సూచిం చారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జైపూర్‌మండల కుం దారం గ్రామానికి చెందిన ఝాన్సీ స్వయం సహాయక సంఘం సభ్యులు తమ సంఘంలో జరిగిన అవకతవకలపై సమగ్రవిచారణ జరిపించాలని అర్జీ సమ ర్పించారు. నస్పూర్‌ మున్సిపాలిటీలోని ప్రగతినగర్‌వాసులు తమ కాలనీలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని వినతిపత్రం అందించారు. అలాగేమంచిర్యాల, బెల్లం పల్లి, లక్షెట్టిపేట, దండేపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మండలస్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య, రాములు, ట్రైనీ డిప్యూటీకలెక్టర్‌ విలాయత్‌ అలీ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 11:50 PM