Mancherial: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:45 PM
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చిన దర ఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నా రు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చిన దర ఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీకి చెందిన మాదరబోయిన కోమలత తనకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని దర ఖాస్తు అందజేసింది. దండేపల్లి మండలానికి చెందిన వొడ్నాల శంకర్, కడారి బుచ్చయ్య తమకు చేనేతపింఛన్ ఇప్పించాలని వేరువే రుగా అర్జీలు అందించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన తోటకళావతి తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేయాలని దరఖాస్తు అందించింది. కన్నెపల్లి మం డలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన కుశన శంకరయ్య తన తల్లికి విరాసత్ ద్వారా వచ్చిన భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, తమకు తెలియకుండా కొందరు దొంగపట్టా చేయించుకున్నారని దీనిపై విచా రించి ఆ పట్టాను రద్దుచేసి తమకు న్యాయం చేయా లని దరఖాస్తు అందజేశారు. అలాగే మందమర్రి, భీమారం, కాసిపేట మండలాల నుంచి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 58దరఖాస్తులు వచ్చా యని వాటిని పరిశీలించి పరిష్కరించే విధంగా అధి కారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలి పారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌లు చంద్రయ్య, రాములు, రెవెన్యూఅధికారి మోతీరాం, ఇతర అధి కారులు పాల్గొన్నారు.