Mancherial: పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:54 PM
నెన్నెల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రతి పోలీసుకానిస్టేబుల్ గ్రామ పోలీసు అధికారిగా నిరంతరం పల్లె లను సందర్శించాలని డీసీపీ భాస్కర్ అన్నారు.
-డీసీపీ ఎగ్గడి భాస్కర్
నెన్నెల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రతి పోలీసుకానిస్టేబుల్ గ్రామ పోలీసు అధికారిగా నిరంతరం పల్లె లను సందర్శించాలని డీసీపీ భాస్కర్ అన్నారు. ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంతోపాటు సమా చార వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఆయన బుధవారం నెన్నెల పోలీస్ స్టేషన్‌ను తనిఖీచేశారు. పరిసరాలను పరిశీ లించి, రిసెప్షన్ సెంటర్‌లోని సిబ్బం దితో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో వివ రాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియ గూర్చి అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెదలా లని సూచించారు. దర్యాప్తులో భాగం గా నేరస్థలాన్ని తప్పని సరిగా సందర్శించి ఫొటో లు, వీడీయోల ద్వారా ఆదారాలు సేకరించాల న్నా రు. ఈ-సాక్ష్య అప్లికేషన్‌లో వెం టనే కేసు వివరాలు నమోదు చేయా లన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా నడుచుకోవాల న్నారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వ హించి సీసీ కెమెరాల ప్రాధాన్యత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రహదారిభద్రత, ట్రాఫిక్‌నియమాలపై అవగాహన పెంపొందించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల నియం త్రణ కోసం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. బెల్లంపల్లి రూరల్‌సీఐ హనోక్, నెన్నెల ఎస్సై రామకృష్ణ ఉన్నారు.