Share News

Mancherial:సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:58 PM

దండేపల్లి ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ సూచించారు.

 Mancherial:సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి

- జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌

దండేపల్లి ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ సూచించారు. బుధవారం మండలంలోని లింగాపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యఉపకేంద్రం, ఆయుష్మాన్‌ ఆరోగకేంద్రాలను ఆయన తనిఖీచేపట్టారు. ఈసందర్భం గా ఆసుపత్రిలో జాతీయ ప్రామాణికత క్వాలిటీ నిర్ధార ణకు అన్నిరకాల ప్రామాణికతలను ఇండిరేటర్లను సమ కూర్చుకోవాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులపట్ల వైద్యులు, సిబ్బం ది మర్యాదగా వ్యవహిరించి వారికి మంచి వైద్యసేవలు అందించాలన్నారు. విధులు, రోగుల పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై కఠినచర్యలు తప్పవన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. 14ఏళ్లు నిండినా ఆడ పిల్లలకు హెచ్పీవి వ్యాక్సినేషన్‌ ఇప్పించాలన్నారు. అనం తరం జాతీయ ప్రామాణికత జిల్లా సంచాలకులు అజ్మీర రాజకుమార్‌, మిడిల్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ డాక్టర్‌ సైలేష్‌, ఆరోగ్య కారకర్తలు అరుణ, వైద్య సిబ్బంది జిల్లా క్వాలిటీ సిబ్బంది మౌనిక, శ్వేత, రాజులతో సమీక్షించి ఆసుపత్రిలో మందుల నిల్వలు, రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు.

Updated Date - Aug 12 , 2026 | 11:58 PM