Mancherial: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:03 AM
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌సీజన్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులు, మార్కెట్‌కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గోనెసంచులు, తూకం యంత్రాలు, టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హమాలీల సమస్యలు తలెత్త కుండా చర్యలు చేపట్టాలన్నారు.
- ఓటరు జాబితా సవరణ త్వరగా పూర్తి చేయాలి..
ఓటరు జాబితా సమగ్రసవరణ పక్రియ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరే ట్‌లో అధికారులు, రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అను గుణంగా సర్‌ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలన్నారు. రాజకీయపార్టీల ప్రతినిధులు తమకు సంబందించిన పోలింగ్‌కేంద్రాల ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీ లించి అర్హులైన ఓటర్ల పేర్లు తదితర అంశాలను గుర్తిం చి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య, రాములు, రెవెన్యూ అధికారి మోతీరాం, ఆర్డీవో శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ పాల్గొన్నారు.
ఫ అవార్డుల జారీ ప్రక్రియను
వేగవంతం చేయాలి..
జిల్లాలో జాతీయ రహదారి 63నిర్మాణంలో అవార్డుల జారీప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి జాతీయ రహదారి విస్తరణలో దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తు లను త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ విద్యార్థుల ఆరోగ్యంపై
శ్రద్ధ వహించాలి..
కోటపల్లి : పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ వహించా లని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని మోడల్‌స్కూల్ బాలికల వసతిగృహం, కస్తూర్బా పాఠశాల, ప్రాథమికపాఠశాల, జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను ఆయన తనిఖీచేశారు. తర గతిగదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. కొనసాగుతున్న అదనపుగదులు, భోజన శాలల నిర్మాణపనులను పరిశీలించి పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహాన్ని సందర్శించి భవనం శిథిలావస్థకు చేరినందున నూతన భవనం కోసం స్థలం సేకరించా లని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం నక్కలపల్లి గ్రామానికి చేరుకుని అక్కడ కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేకసమగ్రసవరణ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రక్రియ పారదర్శకంగా వేగవంతంగా నిర్వహించాల న్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఆయనవెంట తహసీల్దార్ రాఘవేందర్‌రావు, అధికా రులు పాల్గొన్నారు.
ఫ అభివృద్ధి పనులను
త్వరగా పూర్తి చేయాలి..
చెన్నూరు : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శుక్రవారంపట్టణంలోని వెనకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ త్వరగాపనులను పూర్తిచేయాల న్నారు. విద్యార్థులకు సకాలంలో మెను ప్రకారం పౌష్టికా హారం అందించాలన్నారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలను బోధించాలన్నారు.