Share News

Mancherial: ఆసుపత్రి ముందు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ధర్నా

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:15 AM

చెన్నూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 42మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించి గంట పాటు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.

 Mancherial:  ఆసుపత్రి ముందు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ధర్నా

చెన్నూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 42మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించి గంట పాటు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం 42మందికి అవుట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. నాలుగు నెలల నుంచి ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలను నిలిపివేసిందన్నారు. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రతిపాదనలు ఉండగా ఆ మేరకు 42 మందికి అవుట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగాలు కల్పించారని అన్నారు. వందపడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ కాకపోవడంతో 21మంది అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మాత్రమే ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం వందపడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌చేసి 42 మందిని కొనసాగించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు హెచ్చరించారు.

Updated Date - Oct 15 , 2026 | 12:15 AM