Mancherial: పట్టు పురుగుల పెంపకాన్ని అడ్డుకున్న అధికారులు
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:48 PM
కోటపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో పట్టు పురుగుల పెంపకం అటు ఆదివాసీలకు ఇటు అటవీఅధికారుల మధ్య మరోసారి వివాదానికి దారి తీసింది.
-అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ
-స్పృహ కోల్పోయిన గిరిజన రైతు
కోటపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో పట్టు పురుగుల పెంపకం అటు ఆదివాసీలకు ఇటు అటవీఅధికారుల మధ్య మరోసారి వివాదానికి దారి తీసింది. మండలంలోని కావర కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పట్టు పురుగులను పెంచవద్దని, పుట్టు పురుగులు నిషేధం అంటూ బుధవారం అటవీశాఖ అధికారులు పట్టు పంటను నాశనం చేశారు. దీంతో గిరిజనులు అడ్డుకుని.. ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఈ విషయంలో రెండు, మూడుసార్లు ఆందోళనలు చెల రేగగా మరోమారు అటవీఅధికారులు నల్లమద్ది చెట్లపై ఉన్న పట్టు పురుగులను, చెట్ల మండలను విరిచేందుకు ప్రయత్నించారు. దీంతో ఆదివాసీలు, పట్టు పురుగు సాగుదారులు అటవీఅధికారులను అడ్డుకున్నారు. కాగా ఇరువురి మధ్య ఘర్ష ణలు చెలరేగడంతో చింతకుంట్ల లస్మయ్య అనే రైతు అటవీ అధికారుల దాడిలో గాయపడి స్ప్రహ తప్పాడు. అతన్ని వెంటనే స్థానిక రైతులు మొదటగా చెన్నూరు ఆసుపత్రికి అక్కడనుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అటవీ అధికారులు నెట్టడం, కొట్టడంతోనే గిరిజన రైతు తీవ్రంగా గాయప డ్డాడని ఆదివాసీలు ఆందోళనకు దిగారు. కాగా అటవీచట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడి రైతులు అటవీప్రాం తాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారని అటవీ అధి కారులు అంటున్నారు. ఆదివాసీలు మాత్రం తాము పోడు వ్యవ సాయం చేయడం లేదని, చట్టానికి అను గుణంగా చెట్లపైన పట్టు పురుగులను పెంచుతూ నాలుగు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నామని అంటున్నారు. ఆదివాసీలపై అటవీఅధికారులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని గిరిజనరైతులు కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరుతున్నారు.