Mancherial: ఎస్టీపీపీలో ఆక్టోపస్ మాక్‌డ్రిల్
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:52 PM
జైపూర్, అక్టోబరు 28 (ఆంధ్ర జ్యోతి): మండలకేంద్రంలోని ఎస్టీ పీపీ, పరిసర ప్రాంతాల్లో అక్టోపస్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బుధ వారం మాక్‌డ్రిల్ నిర్వహించింది.
జైపూర్, అక్టోబరు 28 (ఆంధ్ర జ్యోతి): మండలకేంద్రంలోని ఎస్టీ పీపీ, పరిసర ప్రాంతాల్లో అక్టోపస్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బుధ వారం మాక్‌డ్రిల్ నిర్వహించింది. రామగుండం పోలిస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా అక్టోపస్ సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో అత్యాధునిక ఆయుధాలతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ ఉగ్రవాదసంస్థలు రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులు, భారీపరిశ్రమలు వంటి కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి కీలకప్రాజెక్టులపై ఉగ్రవాదులు, అసాం ఘిక శక్తులు దాడికి పాల్పడిన సందర్భంలో భద్రతాసిబ్బంది సమర్ధవంతంగా స్పందించక పోతే తీవ్రనష్టం జరిగే అవకాశం ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది ఎలా స్పందిం చాలని, రక్షణచర్యలు ఎలా చేపట్టాలనేది మాక్‌డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. స్థానిక పోలీసులు, ప్లాంట్ భద్రత సిబ్బంది మధ్య సమ న్వయాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇటువంటి మాక్‌డ్రిల్స్ ఉపయోగపడతాయన్నారు.
కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ భూమేష్, ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, సీఐఎస్‌ఎఫ్ కమాండర్ సంచల్ సర్కార్, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.