Mancherial: ఎల్లంపల్లి ప్రాజెక్టు పైకి నో ఎంట్రీ...
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:59 PM
హాజీపూర్, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హాజీపూర్ మండలంలోని గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి లో నిండి జలకళను సంతరించుకుంది.
-నిరుత్సాహపడుతున్న పర్యాటకులు
-ఇబ్బందులు పడుతున్న పాల వ్యాపారులు, ఉద్యోగులు
హాజీపూర్, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హాజీపూర్ మండలంలోని గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి లో నిండి జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు అం దాలను వీక్షించి ఆనందించాలనుకునే సందర్శకులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. గేట్ల ఎత్తివేత నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో గుడిపేట చేపల మార్కెట్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించడంలేదు. దీంతో ప్రాజెక్టు చూసేం దుకు వచ్చిన సందర్శకులు అసహనంతో వెనుదిరిగిపో తున్నారు. దీంతో స్థానికులు పర్యాటకులు పోలీసులు, నీటిపారుదల శాఖల తీరుపై మండిపడుతున్నారు.
ఫ ఉద్యోగులు, కూలీలకు తప్పని తిప్పలు
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం అనంతరం అవతలి వైపున ఉన్న పెద్దపల్లి జిల్లాకు చిన్న వాహనాల రాకపో కలకు అనుమతులు ఇవ్వడంతో ఈ మార్గం ద్వారా ప్రతి రోజు వందలాది మంది ప్రయాణిస్తున్నారు. రామ గుండంలోని ఎస్టీపీసీకి విధులకు హాజరయ్యే ఉద్యోగులు కూడా ఈ మార్గాన్నే ఎక్కువగా వినిగియోస్తుంటారు. పెద్దపల్లి జల్లాలో పనిచేసే కూలీలు, ఇతర కార్మికులు సైతం నిత్యం ఈ ప్రాజెక్టు మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. పాలవ్యాపారులు కూడా ప్రతిరోజు పదుల సంఖ్యలో మంచిర్యాల జల్లా కేంద్రానికి ఈమార్గం ద్వారానే వెళ్తుంటారు. ప్రస్తుతం ప్రాజెక్టు పైకి వెళ్లేందుకు ఆంక్షలు విధించడంతో వీరంతా తీవ్రఇబ్బందులు పడుతున్నారు.