Mancherial: 23వ రోజుకు చేరిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్ష
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:26 PM
నస్పూర్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైద్యఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యో గుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష బుధవారం నాటికి 23వరోజుకు చేరింది.
నస్పూర్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైద్యఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యో గుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష బుధవారం నాటికి 23వరోజుకు చేరింది. దీక్షశిబిరం వద్ద అమ్మవారికి బోనాల నిర్వ హించి వినూత్ననిరసన తెలిపారు. తోళ్లవాగు వద్ద ఉన్న దారి మైసమ్మకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వైద్య సేవలను గుర్తించి త్వరగా రెగ్యూలర్ అయ్యేలా చూడాలని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుకున్నారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.. రామ్మోహన్‌రావు
నస్పూర్ : నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 23 రోజులుగా చేస్తున్న దీక్షశిబిరాన్ని బుధవారం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్ మాజీచైర్మన్ పుస్కూరి రామ్మోహన్‌రావు సందర్శించారు. ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారందర్ని రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ మాజీచైర్మన్ పల్లె భూమేష్, హాజీపూర్‌సర్పంచు మాదవరపు శ్రీలత రామారావు, అత్తి సరోజ, తాజోద్దీన్, బండి పద్మ, రఫీక్, షకీల్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి
మంచిర్యాల కలెక్టరేట్ : కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెచేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్య దర్శి మేకల దాసుబుధవారం మద్దతు తెలిపి సమ్మెలో కూర్చున్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు సమానపనికి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పౌలు, అఫ్రోజ్‌ఖాన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.