Share News

Mancherial: ముదిరాజ్‌లు అన్నిరంగాల్లో ముందుండాలి

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:04 AM

మంచిర్యాల కలెక్టరేట్‌/క్రైం అక్టోబరు 25 (ఆంధ్ర జ్యోతి): ముదిరాజ్‌ సామాజికవర్గాన్ని అన్నిరంగాల్లో ముందుంచేందుకు ఎల్లవేళలా కృషిచేస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.

 Mancherial:  ముదిరాజ్‌లు అన్నిరంగాల్లో ముందుండాలి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

మంచిర్యాల కలెక్టరేట్‌/క్రైం అక్టోబరు 25 (ఆంధ్ర జ్యోతి): ముదిరాజ్‌ సామాజికవర్గాన్ని అన్నిరంగాల్లో ముందుంచేందుకు ఎల్లవేళలా కృషిచేస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రం లోని వేంపల్లిలోని పద్మావతి ఫంక్షన్‌హాలులో ముదిరాజ్‌ ల సింహగర్జన మహాసభకు వారు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్లప్పుడు ముదిరాజ్‌లకు అండగా ఉంటుంద న్నారు. ప్రస్తుతం ఉన్న బీసీ డీ కేటగిరి నుంచి బీసీ ఏ లోకి మార్చే అంశంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసి తగు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. బండ ప్రకాష్‌ ముదిరాజ్‌ ముదిరాజ్‌ల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుండడం అభినందనీయమన్నారు. ఇప్పటికే చెన్నూరులో ముదిరాజ్‌ సంఘం భవనానికి రూ.50లక్షల నిధులను కేటాయించామని, 90శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.25లక్షలు ఎంపీ వంశీకృష్ణ కేటాయించడం అభినందనీయమన్నారు. విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలనుకునే ముదిరాజ్‌ యువతతెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ టాంకాంను సంప్రదించాలన్నారు. అవసరమైన నైపుణ్యాలు, ఆ దేశాల భాష నేర్పించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ముదిరాజ్‌లు ఐక్యం గా ఉండి హక్కులు సాధించుకోవా లన్నారు. ముదిరాజ్‌కు బీమా సౌకర్యం కల్పించేలా కృషిచేస్తానని, మంచిర్యాలలో ముదిరాజ్‌సంఘం భవనం స్థలసేకరణకు కృషిచేస్తా నని తెలిపారు. ఇందుకోసం జిల్లాకలెక్టర్‌కు తెలియ జేస్తామన్నారు. అంతకుముందు పండుగ సాయన్న ముదిరాజ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ మహాసభ వ్యవ స్ధాపక అధ్యక్షుడు బండ ప్రకాష్‌, మాజీఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు ముదిరాజ్‌సంఘం రాష్ట్ర కార్యదర్శి దబ్బెటి తిరుపతి, జిల్లా అద్యక్ష,కార్యదర్శులు గరికంటి కొమురయ్య, సాధనబోయిన కృష్ణ, నాయకులు, ముది రాజ్‌లు పాల్గొన్నారు.

మహిళలకు డ్రైవింగ్‌ శిక్షణ తరగతులు

మందమర్రి టౌన్‌: పట్టణంలో నిరుద్యోగ మహిళలకు డ్రైవింగ్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, దీనిని సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనులశాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. ఆది వారం మందమర్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరా బాద్‌కు చెందిన మూవ్‌సంస్థ ద్వారా ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయ డానికి మహిళాభవన్‌ను ఎంపిక చేశా మని తెలిపారు. శిక్షణ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. డ్రైవింగ్‌పై ఆసక్తిఉన్న మహిళలు, యువతులు శిక్షణకు హాజరుకావ చ్చని పేర్కొన్నారు. డ్రైవింగ్‌ నేర్చుకున్న తర్వాత సంస్థ వారు సర్టిఫికెట్‌ అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మహిళా భవన్‌ను పరిశీలించారు.

ఎల్‌నినోపై బీఆర్‌ఎస్‌

తప్పుడు ప్రచారం..

ప్రకృతి వైపరిత్యమైన ఎల్‌నినోపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మంత్రి వివేక్‌ వెంకటస్వామి మండిప డ్డారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ కాలంలో కరోనా వచ్చిందని, దానికి కారణం బీఆర్‌ఎస్‌ పార్టీనే అని నిందించవచ్చ అని ఆయన ప్రశ్నించారు. ప్రకృతి పరంగా వచ్చే వాటిపై నిందలు వేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా వారు ప్రభుత్వంపై ఆరోప ణలు మానుకొని ప్రజలకోసం పనిచేస్తే బాగుంటుందని చెప్పారు. లేనట్లయితే ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యుత్‌, తాగునీటిపై అంద రికీ వివరించారని అన్నారు. వచ్చే జూలైవరకు కూడా దీని ప్రభావం ఉండబోతుందని అన్నారు. పార్టీనాయ కులు, కార్యకర్తలు కూడా దీనిపై ప్రజలలో అవగాహన తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 12:04 AM