Share News

Mancherial ముఖ్యమంత్రి అండతోనే ఎమ్మెల్యే అరాచకాలు

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:02 AM

మంచిర్యాల కలె క్టరేట్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అండతోనే మంచి ర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అరా చకాలు సాగిస్తున్నా రని బీజేపీ రాష్ట్ర ఉపా ద్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొన్నారు.

 Mancherial  ముఖ్యమంత్రి అండతోనే ఎమ్మెల్యే అరాచకాలు
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి

మంచిర్యాల కలె క్టరేట్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అండతోనే మంచి ర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అరా చకాలు సాగిస్తున్నా రని బీజేపీ రాష్ట్ర ఉపా ద్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడుసంవత్సరాలుగా మంచిర్యాల జిల్లాలో ప్రతిపక్షపార్టీల నాయకులపై, వ్యాపారులపై దాడులు జరుగు తున్నా, అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నా ముఖ్యమంత్రి, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌నాయకులు యువ తను గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా చేసి దాడులకు ప్రేరేపిస్తున్నార న్నారు. మూడు సంవత్సరాలుగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మంచిర్యాలలో భూ కబ్జాలు, దాడులు, వసూళ్లు చేస్తూ ఇప్పుడు వర్గాలుగా విడిపోయి మంచిర్యాలలో అలజడి సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నా రన్నారు. వారంరోజులుగా ఎన్నడూ లేనివిధంగా ఎప్పుడు ప్రజాప్రతినిధి కానీ వ్యక్తికి 300మంది పోలీసుబలగాలతో రక్షణ కల్పిస్తున్నారని, ఎవరి అండతో బలగాలను మోహరించారో ముఖ్యంత్రి సమాధానం చెప్పాలన్నా రు. ప్రశాంతంగా ఉన్న మంచిర్యాలను కాంగ్రెస్‌ నాయకులు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకోవడంతో ప్రజలు భయపడుతున్నా రన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవా లని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 26 , 2026 | 12:02 AM