Mancherial రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:33 PM
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని అదనపుకలెక్టర్ చంద్రయ్య అన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని అదనపుకలెక్టర్ చంద్రయ్య అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో గురువారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మంచిర్యాలజిల్లా రక్తనిధి కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రక్తదానం చేయడం ద్వారా తలసేమియా, సికిల్‌సెల్ రక్తహీనత వంటి వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు ప్రమాదాల్లో గాయపడి అత్య వసరంగా రక్తం కావాల్సిన వారి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. విద్యా సంస్థలు, సింగరేణి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రక్తదానశిబిరాలను నిర్వహించా లన్నారు. అనంతరం ఎక్కువసార్లు రక్తదానం చేసిన దాతలు, ప్లేట్‌లెట్స్ దానం చేసిన రక్తదాతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డీఎం హెచ్‌వో నరేందర్ రాథోడ్, జిల్లాసంక్షేమా ధికారి రౌఫ్ ఖాన్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతి నిధులు మాస్‌మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఫ రక్తదాన శిబిరం
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో గురువారం రక్త దాన శిబిరం నిర్వహించారు. పలువురు రక్త దానం చేశారు. కార్యక్రమంలో బ్లడ్‌డొనేషన్ క్యాంప్ మధుసూదన్‌రెడ్డి, సభ్యులు పాల్గొ న్నారు. అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ సెకండ్ వాయిస్ డిస్ర్టిక్‌గవర్నర్ మోహన్‌గౌడ్ సొం తంగా రక్తదానం చేసి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు 30మందితో రక్తదానం చేయించారు. కార్యక్రమంలో సభ్యులు మధు సూదన్‌రెడ్డి, చంద్రమోహన్‌గౌడ్, వెంకటేశ్వర్లు, మహేందర్, శ్రీనివాస్, సంతోష్‌కుమార్, రక్త నిధి వైద్యులు ప్రేమ్‌సాయి పాల్గొన్నారు.
రక్తదానం ప్రతీ ఒక్కరి బాధ్యత
గర్మిళ్ల : రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం మంచిర్యాలలోని ఇండి యన్ రెడ్‌క్రాస్‌సొసైటీ బ్లడ్‌బ్యాంక్ కేంద్రంలో రక్తదానశిబిరం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం అవసరం ఉన్న వారికి రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలను కాపాడిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ సభ్యులు చంద్ర మోహన్‌గౌడ్, చందూరి మహేందర్, శంకర్ వర్మ, సంతోష్, కిషన్, చంద్రమౌళి, మోహన్ కృష్ణ, రాజేష్, సమీర్, వాగ్దేవి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ మల్లయ్య, వివేకవర్ధిని ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వలంటీర్లు పాల్గొన్నారు.