Mancherial: కార్మికుల సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుదాం
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:39 PM
కాసిపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : దేవాపూర్ అదాని సిమెంటు కంపెనీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుదామని ఓరియంట్ సిమెంట్ కంపెనీ
కాసిపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : దేవాపూర్ అదాని సిమెంటు కంపెనీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుదామని ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికసంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఆదివాసీ కార్మికసంఘం అధ్య క్షుడు ఆడెజంగు అన్నారు. ఆదివారం దేవాపూర్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొంతకాలంగా దేవాపూర్ సిమెంటు కంపెనీలో కార్మికులను యజమాన్యం ఒత్తిడికి గురిచేస్తున్నదన్నారు. కార్మికులపై పనిభారం పెంచుతుం దని, దీంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏడాదిగా వారసత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నదని, కాంట్రాక్టు కార్మికులకు పనిదినాల్లో కోత విధించి ఉపాధిపై దెబ్బ కొడుతున్నదన్నారు. కార్మికుల సంక్షే మాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పర్మినెంటు, లోడింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే యజ మాన్యంపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో కార్మికసంఘాల నాయకులు పుస్కూరి విక్రమ్‌రావు, మడావి అనంతరావు, పన్నాల మహేష్, అక్కెపల్లి శ్రీనివాస్, వడ్లూరి మల్లేష్, కార్మికులు పాల్గొన్నారు.