Mancherial: భూ సంబంధిత దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:56 PM
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థా యిలో విచారణచేసి నిర్ణీతగడువులోగా పరిష్కరించాల ని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు.
-కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థా యిలో విచారణచేసి నిర్ణీతగడువులోగా పరిష్కరించాల ని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరే ట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు భూదాన్ భూములకు సంబంధించిన దానపత్రాలు, పంపిణీ పత్రాలను గుర్తించి నిర్ధేశించిన ఫార్మట్లలో వివరాలను స్కాన్‌చేసి అప్‌లోడ్ చేయాలన్నారు. భూసంబంధిత కోర్టు కేసుల ప్రస్తుత పరిస్థితిని ఎప్ప టికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. రీసర్వేప్రక్రియను వేగవంతం చేసేం దుకు అవసరమైన అదనపు జీఎన్ ఎస్‌ఎస్ రోవర్ పరికరాలను సమకూర్చుని సకాలంలో సర్వేను పూర్తిచేయాలన్నారు. జీవోనెంబరు59,76లకు సంబం ధించిన ప్రభుత్వభూముల క్రమబద్దీకరణ ప్రక్రియను ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. భూభారతి పోర్టల్ ద్వారా అందిన పాత, కొత్తఫార్మా ట్లలోని పెండింగ్ దరఖాస్తులను విచారించి సంబంధి త రికార్డులఆధారంగా వేగవంతంగా పరిష్కరించేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జనగ ణన శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్వేఅండ్‌ల్యాండ్ రికార్స్డ్ ఏడీ,గణాంకఅధికారి పాప య్య, సెన్సెస్ ఆపరేషన్స్ రాష్ట్ర కన్సల్టెంట్ కృష్ణయ్య, మాస్టర్ ట్రైనర్ శరణ్య తదితరులు పాల్గొన్నారు.