Share News

Mancherial: భూ రీసర్వేను గడువులోగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:24 PM

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను నిర్ధేశిత గడు వులోగా పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Mancherial:  భూ రీసర్వేను గడువులోగా పూర్తి చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను నిర్ధేశిత గడు వులోగా పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధ వారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ భూ రీసర్వే అత్యంత ప్రాధా న్యత కలిగినదని, తతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు ప్రతి భూ యజమానికి వారి భూమిపై స్పష్టమైన హక్కులు, ఖచ్చితమైన సరిహద్దులు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వాప్తంగా వెయ్యి గ్రామాల్లో సర్వే పనులు ప్రారంభం కాగా 416గ్రామాల్లో సర్వేపూర్తి అయ్యిందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు కేటాయించిన స్థలాల విషయంలో ఎవరూ అనవస రంగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం, లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలకు పాల్ప డకుండా పర్యవేక్షించాలన్నారు. ఇళ్లనిర్మాణాలు సజా వుగా సాగేలా రెవెన్యూ, గృహనిర్మాణశాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచే యాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిం చేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుం టున్నామన్నారు. రీసర్వేకు అవసరమైన రోవర్లను అధి కారులకు అందించి ప్రక్రియను వేగవంతం చేశామన్నా రు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ రాములు, సబ్‌కలెక్టర్‌ మనోజ్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, ల్యాండ్‌రికార్స్‌ ఏడీ శ్రీని వాస్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:24 PM