Share News

Mancherial: గూడెంలో కార్తీక శోభ

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:23 PM

దండేపల్లి నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం పురస్కరించుకుని దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయం లో భక్తుల సందడి నెలకొంది.

 Mancherial:  గూడెంలో కార్తీక శోభ
గూడెంలో కుటుంబసమేతంగా సత్యదేవుని సాముహిక వ్రతం ఆచరిస్తున్న భక్తులు

కార్తీక దీపారాధన, వ్రతాలు

దండేపల్లి నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం పురస్కరించుకుని దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయం లో భక్తుల సందడి నెలకొంది. గురువారం ఉదయం నుంచే గూడెంకు భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చి, గోదావరినదిలో కార్తీక స్నానా లు ఆచరించారు. కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకొని భక్తులు సత్యదేవున్ని దర్శించుకొని కార్తీకపూజలు చేశారు. ఆలయం ప్రాంగణంలో ధ్వజస్తంభం, ఉసిరి, రావిచెట్టు, ప్రధాన ఆలయం ఎదుట మహిళలు కార్తీకదీపాలు వెలిగించి పూజలు చేశారు. వందలాది మంది సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను నోముకొన్నారు. దీంతో గూడెంగుట్టు పరిసర ప్రాంతమంతా భక్తులతో కార్తీక సందడి నెలకొంది.

Updated Date - Nov 12 , 2026 | 11:52 PM