Share News

Mancherial: యువతకు ఉద్యోగాలు కల్పించాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:44 PM

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): దేశ యువతను యువ శక్తి అంటూ ప్రసంగాల్లో పొగడడం కాదని.. వారికి శాశ్వత ఉద్యో గాలు,

Mancherial:  యువతకు ఉద్యోగాలు కల్పించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): దేశ యువతను యువ శక్తి అంటూ ప్రసంగాల్లో పొగడడం కాదని.. వారికి శాశ్వత ఉద్యో గాలు, ఉపాధి కల్పించాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర పేర్కొ న్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఏఐవైఎఫ్‌ జిల్లా మూడవసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగావకాశాలను తగ్గిస్తున్నాయ న్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవే టీకరణ, కాంట్రాక్టీకరణను పెంచుతున్నదని అన్నారు. దీంతో యువతకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయన్నారు. మంచిర్యాల జిల్లాలో బొగ్గు, విద్యుత్‌, వ్యవసాయం, పారిశ్రామిక వన రులు ఉన్నా జిల్లా లోని యువతకు తగిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లేవని అన్నారు. వారికి ఉపాధి అవ కాశాలు కల్పించా ల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. అలాగే సెప్టెంబరు 8,9,10 తేదీల్లో యాదగిరి గుట్టలో నిర్వహించే ఏఐ వైఎఫ్‌ రాష్ట్ర మూడవ మహాసభలను విజ యవంతం చేయాలని కోరారు. కార్యక్ర మంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కొంకుల రాజేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, నాయకులు నరేష్‌, రవి, పోచన్న, లక్ష్మణ్‌, మహేష్‌, దినేష్‌, వంశీ, దుర్గారావు, హరీష్‌, రాకేష్‌, తిరుపతి, లవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:44 PM