Share News

Mancherial: గిరిజన సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలే

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:29 PM

దండేపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలేనని రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ మాజీచైర్మన్‌ కోట్నాక తిరుపతి అన్నారు.

Mancherial:  గిరిజన సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలే
గుడిరేవులో కాకో ఆమ్మవారిని దర్శించుకుంటున్న గిరిజన కార్పొరేషన్‌ మాజీచైర్మన్‌ తిరుపతి

రాష్ట్ర గిరిజన కార్పొరేషన్‌ మాజీచైర్మన్‌ కోట్నాక తిరుపతి

దండేపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలేనని రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ మాజీచైర్మన్‌ కోట్నాక తిరుపతి అన్నారు. మండలంలోని గుడిరేవు పద్మల్‌పూరీ కాకో ఆలయం లో దండారీ గుస్సాడి వేడుకల సంద ర్భంగా బుధ వారం కాకో ఆలయాన్ని సందర్శించారు. గిరిజన సంప్రదాయ బద్దంగా గుస్సాడితో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాకో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు చేసి మొక్కు లు చెల్లించుకున్నారు. ఆయన మాట్లా డుతూ ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రజాప్రభుత్వంతోనే ఆదివాసీ గిరిజనులకు ప్రత్యేకగుర్తింపు ఇచ్చివారి అభ్యున్నతికి పాటుపడేదే కాం గ్రెస్‌ ప్రభుత్వమన్నారు. ఆయన వెంట మాజీసర్పంచులు కొమురం లింగారావు, చిట్ల మంజుబార్గవి, నాయకులు వెంగళరావు, గిరిజనులు ఉన్నారు.

కాకో దేవాలయంలో

పోటెత్తిన ‘జనజాతర’

పద్మల్‌పురి కాకో ఏత్మల్‌సార్‌ పేన్‌ ఆలయానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నలుమూలల నుంచి గిరి జనులు తరలివచ్చి అమ్మవారికి భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. గుస్సాడి నృత్యాలు, మహిళలు రేలారేలా ఆటపాటలతో సందడి చేశారు. గిరిజనంతో ఆలయ పరిసర ప్రాంతమంతా గుస్సాడి దండారీ వేడుకలతో మార్మోగింది.

Updated Date - Nov 05 , 2026 | 12:05 AM