Share News

Mancherial: మందమర్రిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:53 PM

మందమర్రి టౌన్‌, అక్టోబరు 7 (ఆంరఽధజ్యోతి): రాష్ట్రం లోనే మందమర్రి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దు తానని రాష్ట్ర గనులు, ఉపాధి కల్పనశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

Mancherial: మందమర్రిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

మందమర్రి టౌన్‌, అక్టోబరు 7 (ఆంరఽధజ్యోతి): రాష్ట్రం లోనే మందమర్రి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దు తానని రాష్ట్ర గనులు, ఉపాధి కల్పనశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. బుధవారం పట్టణంలోని సాయి బాబా ఆలయం వద్ద పట్టణ అభివృద్ధికి సంబంధించి రూ.15కోట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకవర్గంలేని మందమర్రి మున్సిపాలిటీపై ప్రత్యేకదృష్టి పెట్టామన్నారు. ఈ నిధు లతో మున్సిపాలిటీలోని 24వార్డులలో పనులు చేపట్ట నున్నట్లు పేర్కొన్నారు. తాగునీటికోసం 40కోట్లతో అమృ త్‌స్కీం కింద పైపులైన్‌పనులు నడుస్తున్నాయని తెలి పారు. పనిపూర్తయితే ఇంటింటికి నల్ల నీరు అందుతుం దని తెలిపారు. అనంతరం వెంకటేశ్వర టెంపుల్‌ ఏరి యా, 20వవార్డు రామన్‌కాలనీ, 2వవార్డులో పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు గణేష్‌, జావిద్‌ఖాన్‌, ఎండీ ఇసాక్‌, బీరయ్య, తుంగపిండి విజయ్‌, రాకేష్‌, బత్తుల సరిత, శ్రీనివాస్‌, బండి శంకర్‌, అధికారులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి..

మందమర్రిరూరల్‌: గ్రామాల అభివృద్ధికి ప్రభు త్వం కృషిచేస్తుందని మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. మందమర్రి మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో బుధవారం 33/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణపనులకు ఆయన భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో విద్యుత్‌సమస్యలు పూర్తిగా తొలగిపోతాయన్నారు. కార్యక్రమంలో సర్పం చులు సెగ్యం వెంకటేష్‌, పెంచాల మధు, డీసీసీ అధ్య క్షులు రఘునాధ్‌రెడ్డి, మండలకాంగ్రెస్‌ అధ్యక్షుడు కడారి జీవన్‌కుమార్‌, గందె రాంచందర్‌, ఎంపీడీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, జిల్లా సెక్రటరీనీలయ్య, ఉపసర్పంచు రాజే శ్వరి, కార్యకర్తలు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ

గతనెలలో నస్పూర్‌లో జరిగిన రోడు ్డప్రమాదంలో మృతిచెందిన వెంక టాపూర్‌, పొన్నారం గ్రామాల్లో మృతుల కుటుంబాలను బుధవారం మంత్రి వివేక్‌వెంకటస్వామి పరామర్శించారు. అగ్గుసౌందర్య చిత్రపటం వద్ద నివాళుల ర్పించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. రెండునిమిషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబీకులను ఓదార్చారు.

మండల అభివృద్ధే ధ్యేయం

భీమారం : భీమారం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెన్నూరు మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం మండలం లోని దాంపూర్‌ గ్రామంలో ఆరోగ్యఉప కేంద్రం నిర్మాణా నికి భూమిపూజ చేశారు. అనంతరం బాలవికాస ఆధ్వ ర్యంలో500లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్‌ ప్లాంట్‌ను, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచు చేగుంట కొమురయ్య, మండలకాంగ్రెస్‌ అధ్య క్షుడు పోడేటి రవి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఉష్కమల్లశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య..

చెన్నూరు : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సదుపాయా లతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. బుధవారం చెన్నూరులోని ప్రభుత్వగిరిజన బాలుర ఆశ్ర మోన్నతపాఠశాలలో అదనపుగదులు, పూర్తి చేయబడిన మరుగుదొడ్లు, స్నానపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన బాలుర ఆశ్రమపాఠశాలలో రూ.38లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో పనులను చేపట్టి పూర్తిచేశామన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం, శుద్దమైన తాగునీరు, పుస్తకాలు అంది స్తామన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియో గించుకుని, క్రమ శిక్షణ ఏకాగ్రతతో చదువుకుని మంచి మార్కులు సాధించాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి సురేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, చైర్మన్‌ పెద్దింటి పద్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేష్‌ ప్రసాద్‌, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:53 PM