Share News

Mancherial: పేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలి

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:52 PM

దండేపల్లి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పేదలందరికి ఇంటి స్థలాలను కేటాయించాలని వ్యవసాయకార్మికుల సంఘం నాయకులు పేర్క రాజేష్‌ కనికరాపు అశోక్‌ డిమాండ్‌ చేశారు.

Mancherial:  పేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలి

దండేపల్లి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పేదలందరికి ఇంటి స్థలాలను కేటాయించాలని వ్యవసాయకార్మికుల సంఘం నాయకులు పేర్క రాజేష్‌ కనికరాపు అశోక్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం దండేపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజనులు, నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని దండేపల్లి బస్టాండ్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మండలంలోని నెల్కివెంకటాపూర్‌ గ్రామ శివారులోని సర్వేనెంబర్‌ 110లోని ప్రభుత్వభూమిని గిరిజనులు, నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇవ్వాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ రోహిత్‌ దేశ్‌పాండేకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇటీవల కలెక్టర్‌ చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్‌ అవార్డు అందుకున్న సందర్భంగా వారు తహసీల్దార్‌ రోహిత్‌ దేశ్‌పాండేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఇంద్రవతి, కమల,రేణుక, రాథబాయి, చిన్నక్క, రమాదేవి, తిరుమల పాల్గొన్నారు. ఉత్తమ అవార్డుపొందిన సందర్భంగా తాళ్లపేట ముస్లింమైనార్టీకమిటీ ఆధ్వర్యంలో సైతం తహసీల్దార్‌ను శాలువాకప్పి ఘనంగాసన్మానించి,మెమెంటో,స్వీటు తినిపించారు.

Updated Date - Aug 24 , 2026 | 11:54 PM