Mancherial: బైపాస్‌రోడ్డులో భారీ పోలీసు బందోబస్తు
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:50 PM
మంచిర్యాలక్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల బైపాస్ రోడ్డులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాళ్లపేటలో జరిగిన ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో బైపాస్‌రోడ్డులోని మంత్రి అనుచరుడు కాంగ్రెస్‌సీనియర్ నాయకుడు మంతన జగన్మోహన్‌రావు ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంచిర్యాలక్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల బైపాస్ రోడ్డులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాళ్లపేటలో జరిగిన ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో బైపాస్‌రోడ్డులోని మంత్రి అనుచరుడు కాంగ్రెస్‌సీనియర్ నాయకుడు మంతన జగన్మోహన్‌రావు ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 6గంటల నుంచి బందోబస్తు ఏర్పాటు చేయగా ఒక అడిషనల్ డీసీపీ, ఇద్దరు డీసీపీలతోపాటు నలుగురు ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు సుమారు 400మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. బైపాస్ రోడ్డులో అనుమానితులను విచారిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు జగన్మోహన్‌రావు ఇంటి ముట్డడి కార్యక్రమం ఉంటుందని సమాచారంతో బందోబస్తు చేపట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే, మంత్రి అనుచరుల మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య దాడులు జరుగుతున్నాయి. దండేపల్లి మండలం తాళ్లపేటలో మంగళవారం జరిగిన దాడిలో ఇద్దరి తలలు పగలడంతో మరింత వివా దం చెలరేగింది. ఈ సంఘటన సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన దుమారం ఎలాంటి పరిస్థితులకు తావిస్తుందనే ఆందోళన నెలకొంది.