Mancherial: సమర్థవంతమైన ప్రజాపాలన దిశగా ప్రభుత్వం
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:05 AM
జైపూర్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమర్థ వంతమైన ప్రజాపాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి
- మంత్రి వివేక్‌వెంకటస్వామి
జైపూర్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమర్థ వంతమైన ప్రజాపాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఆదివాసీసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుమరంభీం విగ్రహాన్ని జిల్లాకలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావితరాలకు చరిత్ర అందించేలా కుమరంభీం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీ యమన్నారు. ఈనెల15న స్వాతంత్య్ర దినోత్సవం సంద ర్భంగా అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్‌లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభు త్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రతీఒక్కరు సద్విని యోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ కుమార్‌దీపక్ మాట్లాడుతూ ఆదివాసీలకు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమపథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, తహసీల్దార్ వనజారెడ్డి, ఇన్‌చార్జీ ఎంపీడీవో శ్రీపతి బాపురావు, ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న, సర్పంచు కూనభాస్కర్, పార్టీమండల అధ్య క్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమపథకాలు అందించాలి..
చెన్నూరు : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీఒక్కరికి అందించేలా అధి కారులు కృషిచేయాలని మంత్రి పేర్కొన్నారు. బుధవారం చెన్నూరులోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే సంవ త్సరం గోదావరి పుష్కరాలకు సంబంధించి పుష్కరఘాట్ల ఏర్పాట్లు, అంతర్గత రహదారుల నిర్మాణం, ప్రజలసౌకర్యాల క్పలన అంశాలపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. పుష్క రాలకు వచ్చేభక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుచేయాలని సూచించారు. కార్య క్రమంలో ఆయాశాఖల అధికారులు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.
రోడ్డు పనులను వేగవంతం చేయాలి..
చెన్నూరు పట్టణంలోని ప్రధానరోడ్డు పను లను వేగవంతంగా పూర్తిచేయాలని మంత్రి వివేక్‌వెంక టస్వామి తెలిపారు. బుధవారం రోడ్డు పనులను పరిశీ లించి మాట్లాడారు. నాణ్యత విషయంలో రాజీపడ కూడదని, రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తిచేసి ప్రజలకు సమస్యలులేకుండా కృషి చేయాలన్నారు.
తాడిచెర్ల, ఆర్కేపీ ఓసీపీలకు త్వరలోనే అనుమతులు
మందమర్రిటౌన్ : పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని తాడిచెర్ల బ్లాక్, చెన్నూరు నియోజకవర్గంలోని ఆర్కే ఓసీపీ రెండవఫేజ్‌కు సంబంధించి ఫారెస్టు అనుమ తులు త్వరలోనేవస్తాయని మంత్రి తెలిపారు. బుధ వారం ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో సింగరే ణికి మరిన్ని గనులు సాధిస్తామన్నారు. సింగరేణి పరిరక్షణకు తన తండ్రి కాకావెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీ యమన్నారు. కేకే6, శ్రావణపల్లి, చెన్నూరులో మూతపడిన గనుల వివరాలను సేకరించానని, సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రారంభమయ్యే సాధ్యాసాధ్యాలను పరిశీలి స్తామన్నారు.
ప్రత్యేకంగా ప్రాథమిక సహకారకేంద్రాలు
ఏర్పాటు చేయాలి
భీమారం : మండలంలో రైతులకు ప్రత్యేకంగా ప్రాథమిక సహకార కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు బుధవారం మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందించారు. మండలం ఏర్పాటై దశాబ్దన్నర పూర్తవుతున్నా ప్రాథమిక సహకారకేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.