Mancherial: ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:47 PM
మంచిర్యాల కలెక్టరేట్, నవంబర్ 12 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రభు త్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు అన్నారు.
- అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు
మంచిర్యాల కలెక్టరేట్, నవంబర్ 12 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రభు త్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో అదనపుకలెక్టర్ జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల హెచ్‌వోడీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి పీపీసీ హెచ్‌వోడీ తప్పనిసరిగా పాటించా లని ఆదేశించారు. పీసీఎస్‌ఏపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిచేయడంతో పాటు, నిర్దేశించిన 16ప్రశ్నలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను పకడ్బందీగా అమలుచేస్తూ, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, డీపీఎం, మెప్మా పీడీ, ఇన్చార్జి జిల్లా సహకార అధికారి, డీసీఎంఎస్ మేనేజర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.