Share News

Mancherial: సకాలంలో సరుకులు పంపిణీ పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:03 AM

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా సకాలంలో సరుకుల పంపిణీ పూర్తి చేయాలని అదనపుకలెక్టర్‌ రాములు అన్నారు.

Mancherial:  సకాలంలో సరుకులు పంపిణీ పూర్తి చేయాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా సకాలంలో సరుకుల పంపిణీ పూర్తి చేయాలని అదనపుకలెక్టర్‌ రాములు అన్నారు. శనివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహిం చారు. అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ఇన్‌చార్జీలు, డిప్యూటీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీ సర్లకు సూచనలు చేశారు. ఎంఎల్‌ఎస్‌ పాయిం ట్లలో స్టాక్‌కు సంబంధించిన రికార్డులను సక్ర మంగా నిర్వహించి ఎప్పటికప్పుడు నవీకరించా లని సూచించారు. ప్రతినెల స్టాక్‌వివరాలను పరిశీలించి సంబంధిత రికార్డులతో పూర్తిస్థాయి లో రీకన్సిలియేషన్‌ నిర్వహించాలని ఆదేశిం చారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికా రులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్య క్రమంలో జిల్లా పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ శ్రీకళ, డిప్యూటీ తహసీల్దార్‌, ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

దరఖాస్తుల పరిష్కారానికి

చర్యలు తీసుకోవాలి

జిల్లాలో పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కా రానికి అధికారులు చర్యలుతీసుకోవాలని అదనపుకలెక్టర్‌ అన్నారు. శనివారం కలె క్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా వచ్చిన పెండింగ్‌ దరఖాస్తులను మండల, ఆర్డీవో, మున్సిపల్‌కార్పొరేషన్‌ తదితర స్థాయిల్లో పరిశీ లించి, జిల్లాస్థాయిలో పరిష్కరించాల్సిన అంశా లను వేగంగా క్లియర్‌ చేయాలన్నారు. పెండిం గ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి నిబంధ నల ప్రకారం పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్యఉన్న భూసరిహద్దు వివా దాలను మండలాలవారీగా గుర్తించి ప్రస్తుతం ఉన్న కేసులు, కోర్టుకేసుల వివరాలను సమ గ్రంగా సిద్దంచేయాలన్నారు. సంబంధితశాఖల అధికారులతో సమన్వయంచేసుకుంటూ పరి ష్కారానికి అవసరమైనచర్యలు చేపట్టాలన్నారు.

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్‌

నిర్మల్‌ జిల్లాలో ఈనెల5న ఉమ్మడిజిల్లా సమావేశం ఉందని, దీనికి మంత్రి శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతున్నందున నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిని రద్దుచేస్తున్నట్లు కలె క్టర్‌ కుమార్‌దీపక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల12నయధావిధిగాప్రజావాణి ఉంటుందని తెలిపారు.

Updated Date - Oct 04 , 2026 | 12:03 AM