Share News

Mancherial: పత్తి సాగులో అధిక సాంద్రత విధానంతో సత్ఫలితాలు

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:13 AM

నెన్నెల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): అధిక సాంధ్రత విధానంతో పత్తిసాగు చేసిన రైతులు సత్ఫలితాలు సాధిస్తు న్నారని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేఖ అన్నారు.

 Mancherial:   పత్తి సాగులో అధిక సాంద్రత విధానంతో సత్ఫలితాలు

- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ

నెన్నెల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): అధిక సాంధ్రత విధానంతో పత్తిసాగు చేసిన రైతులు సత్ఫలితాలు సాధిస్తు న్నారని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేఖ అన్నారు. హెచ్‌డీపీఎస్‌ విధానంతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించి లాభాలు గడించవచ్చన్నారు. మండల కేంద్రంలో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తున్న పంట క్షేత్రాలను పరిశీలించారు. అనంతరం క్షేత్ర పాఠశాల నిర్వ హించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ తేలికపాటి నేలల్లో సైతం ఆధునికపద్ధతిలో సాగుచేస్తే 30శాతం దిగుబడి పెరుగు తుందన్నారు. పత్తిని రెండుమూడుసార్లు కాకుండా ఒకేసారి ఏరుకోవచ్చన్నారు. పంట తొందరగా చేతికి వస్తుందని, ఆ తర్వాత ఇతరపంటలు వేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చని చెప్పారు. ఎంఏవో పుప్పాల సృజన, ఏఈవో ధనలక్ష్మి ఉన్నారు.

ఫ ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం చేయాలి..

ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని, రాబోయే గడ్డు కాలాన్ని ఎదుర్కొనడం గూర్చి రైతులను అప్రమత్తం చేయాలని డీఏవో సురేఖ అన్నారు. డివిజన్‌లోని నెన్నెల, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి మండలాల ఎంఏవోలు, ఏఈవోలతో సమావేశమ య్యారు. తీవ్రమైన సాగునీటి కొరత, కరెంటు కోతలు ఉండే అవకాశం ఉంటుందన్నారు. యాసంగిలో అధిక నీరు అవసర మయ్యే వరిపంటను వేయకుండా చూడాలన్నారు. ప్రత్యా మ్నాయంగా ఆరుతడి పంటలైన కంది, జొన్న, పెసర, మక్క, సాగు చేయసేలా రైతులను చైతన్య పర్చాలని డీఏవో సూచించారు.

Updated Date - Oct 15 , 2026 | 12:13 AM