Share News

Mancherial: ప్రమాదాల నివారణే లక్ష్యం: సీపీ

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:07 AM

మంచిర్యాలక్రైం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమా దాల నివారణతో పాటు ప్రజ లకు సురక్షిత ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా రోడ్డు భద్రత నిబంధనలను కఠి నంగా అమలు చేయాలని రామగుండం పోలీస్‌ కమిష నర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అధి కారులను ఆదేశించారు.

Mancherial:  ప్రమాదాల నివారణే లక్ష్యం: సీపీ

మంచిర్యాలక్రైం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమా దాల నివారణతో పాటు ప్రజ లకు సురక్షిత ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా రోడ్డు భద్రత నిబంధనలను కఠి నంగా అమలు చేయాలని రామగుండం పోలీస్‌ కమిష నర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అధి కారులను ఆదేశించారు. శని వారం కమిషనరేట్‌ కార్యాల యంలో ట్రాఫిక్‌ పోలీసులతో సమావేశం నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ రహదా రులపై భారీవాహనాలు నిలుపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాంగ్‌సైడ్‌ డ్రైవిం గ్‌ను నియంత్రించేందుకు ప్రత్యేకనిఘా ఏర్పా టుచేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆటోలు, స్కూల్‌ వ్యాన్‌లు, బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థు లను ఎక్కించకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌లు రాజేశ్వ ర్‌రావు, శ్రీనివాస్‌, హనన్‌, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:07 AM