Share News

Mancherial: గణేష్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:06 AM

దండేపల్లి సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్‌ అన్నారు.

Mancherial:   గణేష్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి

మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్‌

దండేపల్లి సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని గూడెం గోదావరినది వద్ద గణేష్‌ నిమజ్జనం చేసే ప్రదేశాన్ని, ఏర్పాట్లను సిబ్బందితో కలిసి పరిశీలించారు. డీసీపీ మాట్లాడుతూ గూడెం గోదావరి తీరం వద్ద రెండుక్రేన్లు, గజ ఈత గాళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈసారి భారీగా గణేష్‌ విగ్రహాలు రానున్న నేపథ్యంలో అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా ఒక ఏసీపీ, ఇద్దరు సీఐలు, 6ఎస్సైలు, 100మంది పోలీసు లతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించ ారు. నిమజ్జనం రోజు నిర్వాహకులు పూజలను త్వరగా పూర్తిచేసి గోదావరి తీరానికి తీసుకు రావాలన్నారు. చిన్న పిల్లలను వెంట తీసుకరావ ద్దన్నారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షతో మెలగాలని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజలరాకపొకలు, భద్రత ఏర్పాట్లపై దృష్టి సారించా లన్నారు. ఆయన వెంట లక్షెట్టిపేట సీఐ రమణ మూర్తి, ఎంపీడీవో జేఆర్‌ ప్రసాద్‌, దండేపల్లి ఎస్సై గుండేటి రాజవర్థన్‌, ఆర్‌ఐ బొద్దుల భూమన్న, గూడెం మాజీఎంపీటీసీ సభ్యుడు తోట మోహన్‌, గ్రామపంచాయతీ కార్యదర్శి నాగ రాజు, పోలీసులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:06 AM