Share News

Mancherial: రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:48 PM

మందమర్రి రూరల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు.

 Mancherial: రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

మందమర్రి రూరల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు. బుధవారం ఆదిల్‌పేట గ్రామంలో పంటల వైవిద్యీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. అంతరపంటల ప్రాధాన్యత, పంటల పరిరక్షణ, సాగు వ్యయాలను తగ్గించే విధానాలను రైతులకు వివరించారు. ఆమె మాట్లాడుతూ రైతులు వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను శాస్ర్తీయ పద్ధతుల్లో ఎంపిక చేసుకుని సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కిరణ్మయి, ఏఈవో రాజశేఖర్‌, ఉపసర్పంచు కొట్రంగి రాజన్న, కృషి సఖిలు వసంత, లిఖిత, రైతులు పాల్గన్నారు.

Updated Date - Aug 19 , 2026 | 11:48 PM