Share News

Mancherial: బుయ్యారంలో రైతుల సంబరాలు

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:05 AM

వేమనపల్లి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బుయ్యారం గ్రామంలో శని వారం రైతులు సంబరాలను నిర్వహించారు. అటవీశాఖ, రెవెన్యూశాఖల మధ్య వివాదా స్పదంగా ఉన్న భూముల సాగుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రైతులు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు.

Mancherial:  బుయ్యారంలో రైతుల సంబరాలు

వేమనపల్లి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బుయ్యారం గ్రామంలో శని వారం రైతులు సంబరాలను నిర్వహించారు. అటవీశాఖ, రెవెన్యూశాఖల మధ్య వివాదా స్పదంగా ఉన్న భూముల సాగుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రైతులు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. 2006లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సుమారు 30మంది దళిత గిరిజనరైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చింది. అయితే ఇన్నిరోజులు ఈ భూములు అటవీశాఖకు చెందినవని రైతులను సాగు చేసుకోనివ్వకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. బాధిత రైతులు ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో రైతులు బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యు లు కొయ్యల ఏమాజీ ఆధ్వ ర్యంలో భూముల వద్దకు వెళ్లి నాగళ్లతో దుక్కులు దున్నారు. రైతులు మాట్లా డుతూ తమ భూముల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ అటవీశాఖ అధికారుల వేధింపులతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో బీజేపీసీనియర్‌ నాయకుడు పులగం తిరుపతి, కేశవరెడ్డి, మహిళామోర్చా మండల అధ్యక్షురాలు ముడిమడుగుల లావణ్య, కౌన్సిల్‌ సభ్యులు శనిగారపు శ్రావణ్‌, నవీన్‌, నాయకులు నర్సింగ్‌, శ్రీనివాస్‌, రాజ్‌కుమార్‌, ప్రశాంత్‌, అవినాష్‌, సత్యనారాయణ, వెంకటేష్‌, శంకర్‌, లక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:05 AM