Mancherial: ప్రతీ ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలి
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:55 PM
జైపూర్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతీ ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు.
జైపూర్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతీ ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జైపూర్ పోలీస్ స్టేషన్‌లో రక్తదానశిబిరాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీపీ మాట్లా డుతూ రక్తదానం సమాజానికి మేలు చేసే ఎంతో గొప్ప కార్యమని తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తదాతలు అందించే రక్తం ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఆరోగ్యపరంగా అర్హత ఉన్న వారు స్వచ్ఛందంగా క్రమం తప్పకుండా రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలన్నారు. రక్త దానం చేసిన ఎస్‌ఐ భూమేష్, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, యువకులను సీపీ అభినందించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్ కుమార్, ఎస్‌ఐ భూమేష్, పోలీసులు పాల్గొన్నారు.
బైక్‌పై సీపీ పెట్రోలింగ్..
మంచిర్యాలక్రైం : మంచిర్యాల పట్టణంలో రామ గుండం పోలిస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంగళవారం అర్ధరాత్రి బైక్‌పై క్షేత్రస్థాయిలో పెట్రో లింగ్ నిర్వహించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిర క్షణకు పోలీసులు చేపడుతున్న చర్యలను స్వయంగా పరిశీలించారు. రాత్రివేళల్లో పట్టణ శివారుప్రాంతాల్లో పోలీసులనిఘా, పెట్రోకార్, బ్లూకోల్ట్స్‌సిబ్బంది పనితీరు ను సీపీ సమీక్షించారు. విధుల నిర్వహణలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రజలకు భద్రత భావం కల్పించేలా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించా లని, ఎలాంటిఅవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా ముందస్తుచర్యలు చేపట్టాలన్నారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలిక లపై ప్రత్యేకనిఘా ఉంచాలని అధికారులను ఆదేశిం చారు. ఆయనవెంట ఏసీపీప్రకాష్, పట్టణఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు, రూరల్‌ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఉన్నారు.