Mancherial: బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరం
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:46 PM
లక్షెట్టిపేట, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాలను ప్రోత్సహిం చడం చాలా పెద్ద నేరం అని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కాసమళ్ల సాయికిరణ్ అన్నారు.
లక్షెట్టిపేట జూనియర్ సివిల్‌జడ్జి సాయికిరణ్
లక్షెట్టిపేట, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాలను ప్రోత్సహిం చడం చాలా పెద్ద నేరం అని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కాసమళ్ల సాయికిరణ్ అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతి థిగా పాల్గొని మాట్లాడారు. అమ్మాయికి 18ఏండ్లు అబ్బాయికి 21సంవత్స రాలు పూర్తి అయిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లకు వివాహాలుచేస్తే చట్టరిత్యా శిక్షార్హులవుతార న్నారు. చిన్నతనంలో పెండ్లి చేయడంతో ఇద్దరి ఆరోగ్యాలు దెబ్బ తింటా యన్నారు. తెలిసీతెలియని వయస్సు కనుక గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుందన్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతారన్నారు. చిన్నతనంలో ఆడపిల్లలు గర్భం దాల్చితే తీవ్రమైన అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం పలుచట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలినర్సయ్య, వైస్‌చైర్మన్ రాజేశ్వరి, మున్సిపల్‌కమిషనర్ విజయ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్య క్షుడు గోవింద్‌రావు, ప్రధానకార్యదర్శి సత్యం, ఏజీపీ సంతోష్, న్యాయ వాదులు గడికొప్పుల కిరణ్, సురేందర్, రవీందర్, ప్రదీప్ కుమార్, సుమన్ చక్రవర్తి, సునీల్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.