Mancherial: పథకాల అమలుకు అర్హతే ప్రామాణికం
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:01 AM
మంచిర్యాల కలెక్టరేట్/మంచిర్యాల క్రైం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల అమలుకు అర్హ తే ప్రామాణికమని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్/మంచిర్యాల క్రైం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల అమలుకు అర్హ తే ప్రామాణికమని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్‌హాలులో నూతనంగా మంజూ రైన చేయూత ఆసరా పెన్షన్‌ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ మొత్తం 2509మందికి పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేయగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 2261, హాజీపూర్ మండల పరిధిలో 248 మందికి పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలో పదివేలమందికి పైగా అర్హులైన లబ్ధిదారు లను గుర్తించామని, మంజూరైన పెన్షన్‌లకు సంబం ధించిన ఆర్థిక ప్రయోజనాలు డిసెంబర్ నుంచి లబ్ధిదారులకు అందే అవకాశం ఉంద న్నారు. దివ్యాంగులపెన్షన్‌లకు సంబం ధించి సదరం సర్టిఫికెట్లు సమర్పించిన అనంతరం అర్హతను పరిశీలించి పెన్ష న్‌ల మంజూరుకు చర్యలు తీసుకుంటా మన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపథకాన్నిప్రాంరభిస్తుందని, ఈనెల 19నుంచి అన్ని మున్సిపాలిటీలు, గ్రామా ల్లో ప్రత్యేకశిబిరాలను నిర్వహిస్తామన్నా రు. రేషన్‌కార్డులో నమోదైన 18నుంచి 59సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తు లకు ఈ పథకంద్వారా రూ.5లక్షల బీమా కల్పిస్తా మన్నారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్ చంద్రయ్య, డీసీసీ మాజీఅధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, డీఆర్‌డీవో కిషన్, కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్ తదితరులు పాల్గొన్నారు.