Mancherial: ప్రధాని, విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దహనం
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:46 PM
మంచిర్యాలక్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులు ధర్నా నిర్వహిస్తే వారిపై లాఠీచార్జీ చేయడం సరైంది కాదని..
మంచిర్యాలక్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులు ధర్నా నిర్వహిస్తే వారిపై లాఠీచార్జీ చేయడం సరైంది కాదని.. కేంద్రప్రభుత్వం మొండివైఖరిని మానుకోవా లని కార్పొరేషన్ కాంగ్రెస్‌పార్టీ ప్రెసిడెంట్ తూముల నరేశ్, మేయర్ ధర్ని మధూకర్ అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్‌పార్టీ నాయకు లు మంచిర్యాల గాంధీపార్కు వద్ద నిరసన కార్యక్ర మం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ యువత, నిరుద్యోగ మహిళ సమస్యలపై ప్రశ్నించినందుకు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నీట్‌పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతపండు శ్రీనివాస్, హరిక్రిష్ణ, పెంట రజిత, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్ర హం ముందు బుధవారం కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రధానిమోదీ, విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ ప్రశ్న పత్రం లీకేజీతో 25లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మైందని అన్నారు. అనేకమంది మరణిం చారని, ఇందుకు ప్రధానిమోదీ, కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో మున్సి పల్ చైర్‌పర్సన్ పద్మ, వైస్‌చైర్మన్ వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్‌ప్రసాద్ తివారీ, ఎన్‌ఎస్‌యూఐ నియోజకవర్గ అధ్య క్షుడు సంజయ్, మండలవైస్ ప్రెసి డెంట్ మహేష్, నాయకులు కృష్ణ, సయ్యద్ సాహిర్, ఖలీల్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, చైతన్య,నాగరాజు, కమ లాకర్, సలీం, కరీం, జావీద్, మహేష్, నవీన్, మధు, అనిల్, ఇంతియాజ్, లక్ష్మీ, నాగరాజు, లీనా, శేఖర్, శ్రీకాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిటౌన్ : వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. మందమర్రిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు దాడులు చేయడం హేయమైని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మంద తిరుమల్, నర్సింగ్, పుల్లూరి లక్ష్మణ్, బండి సదానందం, సట్ల సంతోష్, బానేష్, పవన్, ఆకారం రమేష్ , ఎండీ ఇసాక్, తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ : ప్రతిపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, గోనె నర్సయ్య, శ్రీనివాస్ యాదవ్, మంతెన లక్ష్మణ్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి : పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం పీడీఎస్‌యూ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్ మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల 20మందికి పైగా విద్యార్థులు మరణించారని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదన్నారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్, అంజన్న, విక్రమ్, అజయ్, విద్యార్థులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట : ఢిల్లీలో ప్రతిపక్షనేతలతో పాటు నీట్‌లో నష్టపోయిన విద్యార్థులపై కేంద్రం దాడి చేయించడం తీవ్రమైన అమానుషం అని మాజీ గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ రాష్ట్ర చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. బుధవారం లక్షెట్టిపేటలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని అక్రమ అరెస్టుచేయడం, ఆయనపై దాడి చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని, పరీక్ష వ్యవస్థపై ప్రజల్లో ఏర్పడిన అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.