Share News

Mancherial: రైతుల భూముల్లోకి వెళ్లవద్దు

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:50 PM

వేమనపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చామన పల్లి గ్రామంలోని కొన్నేళ్లుగా వివాస్పదంగా ఉన్న భూములు సాగు చేసుకోవడానికి హైకోర్టు ఆర్డర్లు జారీ చేసింది.

Mancherial:  రైతుల భూముల్లోకి వెళ్లవద్దు

- హైకోర్టు ఆర్డర్‌ - సంబరాలు చేసుకున్న రైతులు

వేమనపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చామన పల్లి గ్రామంలోని కొన్నేళ్లుగా వివాస్పదంగా ఉన్న భూములు సాగు చేసుకోవడానికి హైకోర్టు ఆర్డర్లు జారీ చేసింది. పట్టాపాస్‌ బుక్‌లు ఉన్న రైతుల భూముల్లోకి అటవీశాఖ అధికారులు వెళ్లవద్దని ఆర్డరు ఇవ్వడంతో శనివారం రైతులు సంబరాలు నిర్వహిం చారు. బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యు డు కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో రైతులు వారి భూముల్లో దుక్కిదున్నారు. గ్రామంలో భాజభజంత్రీలతో సంబరాలు నిర్వహించారు. ఎట్టకేలకు న్యాయ పోరాటంలో తమ భూములు తమకుదక్కాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ అం డగా నిలిచాడు. మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన 120మందిరైతులు 50ఏళ్లుగా సర్వే నెంబరు 65,67లో సాగుచేస్తున్నారు. వారికి ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం పట్టాలు కూడా అందించింది. కానీ అటవీశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఈ భూములు అటవీశాఖకు చెందినవని రైతులను సాగు చేసుకోనివ్వ కుండా అడ్డుకుంటూ అక్రమంగాకేసులు నమో దు చేసి జైలుకు పంపుతున్నారు. దీంతో రైతు లు హైకోర్టులో కేసువేశారు.

రైతులకు అనుకూలంగా తీర్పురావడంతో రైతులు సంతో షం వ్యక్తంచేశారు. సంబరాల్లో బీజేపీ నాయకులు కేశవరెడ్డి, తుల మధుసూద న్‌రావు, రవికుమార్‌, రామయ్య యాదవ్‌, సత్యం, లావణ్య, సత్యనారాయణ, వెంకటేష్‌, బానయ్య, సతీష్‌, లింగయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 11:50 PM