Share News

Mancherial: మళ్లీ నిరాశే ఎదురైంది..

ABN , Publish Date - Jul 31 , 2026 | 10:57 PM

కాసిపేట, జూలై 31 (ఆంధ్ర జ్యోతి): వారంతా గ్రామ పంచా యతీ భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఎమ్మెల్యే వస్తారు అనుకున్నారు.

Mancherial:  మళ్లీ నిరాశే ఎదురైంది..

పంచాయతీ కార్యాలయం ముందు స్థానికుల నిరసన

కాసిపేట, జూలై 31 (ఆంధ్ర జ్యోతి): వారంతా గ్రామ పంచా యతీ భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఎమ్మెల్యే వస్తారు అనుకున్నారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. మల్కేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభించడంలో స్థానికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. శుక్రవారం పల్లంగూడ పంచాయతీ భవన నిర్మాణం ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే గడ్డంవినోద్‌ మల్కేపల్లి గ్రామపంచా యతీ భవనాన్ని ప్రారంభిస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. కానీ ప్రారంభానికి రాకుండా వెళ్లిపోవడంతో ప్రజలు అసహనానికి గురయ్యారు. సర్పంచుకోట్నాక రఘుపతి మంచిర్యాల ఎమ్మెల్యేకొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌ రావు వర్గం కావడంతో ఎమ్మెల్యే వినోద్‌కు గిట్టడం లేదు. అందుకే రెండుసార్లు ప్రారంభా నికి వస్తానని చెప్పి రాలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. గ్రామాల అభివృద్ధికి వర్గపోరు అడ్డువస్తే అలాంటి వర్గపోరు తమకువద్దని, ఎమ్మెల్యే అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూడాలి కానీ ఇలా పక్షపాతంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే విధానాలను నిరసిస్తూ సర్పంచు, వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే వెంటనే భవనం ప్రారంభించాలని ప్రజలు కోరారు.

Updated Date - Jul 31 , 2026 | 10:57 PM