Share News

Mancherial: గూడెం గుట్టకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:52 PM

Mancherial: గూడెం గుట్టకు పోటెత్తిన భక్తులు

Mancherial:   గూడెం గుట్టకు పోటెత్తిన భక్తులు
రావి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగిస్తున్న మహిళలు

- అశేషభక్తుల మధ్య సత్యదేవుడి కార్తీక పౌర్ణమి మహా జాతర

- కార్తీకవ్రతాలు, దీపాలతో సందడిగా మారిన గూడెం గుట్ట

దండేపల్లి నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం గూడెం శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మంగళవారం కార్తీకపౌర్ణమి మహాజాతర కన్నులపండువగా సాగింది. సుమారు 80వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించు కున్నారు. కార్తీకపౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో నలు మూల నుంచి ఉదయంనుంచి భక్తులు కుటుంబ సమే తంగా దేవస్థానానికి తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో కిటకిటలాడింది. గోదావరి నదిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించి, నదిలో కార్తీకదీపారాధన చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల దర్శనానికి ఇబ్బంది కలగకుండా చలువ పం దిళ్లు, తాగునీరు తదితరాలు ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారి దర్శనంకోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సి వచ్చింది. వేదపండితులు, అర్చకులు స్వామి వారికి అభిషేకాది పూజలు నిర్వహించారు.

సత్యదేవున్ని దర్శించుకున్న ప్రముఖులు..

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని మంచిర్యాల జిల్లా జిల్లా కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ దంపతులు, రామగుండుం సీపీ అంబర్‌ కిషోర ఝా దంపతులు దర్శిం చుకొని ప్రత్యేకపూజలు చేశారు. కాగా జైలుశాఖ ఐజీ మురళి బాబు దంపతులు, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య దంపతులు, ఆర్డీవో శ్రీనివాస్‌రావు దంప తులు, మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ దంపతులు కార్తీక వ్రతాలను ఆచరించారు. మాజీఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఏసీపీ ప్రకాష్‌, సీఎస్‌ బీ ఏసీపీ నాగేంద్రగౌడ్‌ సత్యదేవున్ని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.

వ్రతాలు ఆచరించిన 1250జంటలు

కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని సుమారు 1250 లకు పైగా జంటలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. ఈ కార్తీకమాసంలో సత్యనారాయణస్వామి వత్రం నిర్వహిస్తే అంతా శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. వ్రతాలను నిర్వహించేందుకు రెండు చోట్ల మండలపాలను ఏర్పాటు చేశారు.

భారీ పోలీసు బందోబస్తు

ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘట నలు జరుగకుండా డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ప్రకాష్‌ పర్యవేక్షణలో లక్షెట్టిపేట సీఐ డి రమణమూర్తి, దండే పల్లి ఎస్‌ఐ రాజవర్ధన్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు నిర్వహించారు.

Updated Date - Nov 24 , 2026 | 11:52 PM