Mancherial: నేరాల నియంత్రణే పోలీసుల లక్ష్యం
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:09 AM
మంచిర్యాలక్రైం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణే పోలీసుల లక్ష్యమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శనివారం మంచిర్యాల మార్కెట్ లోని వాణిజ్యసంస్థలు, లాడ్జీలు, బ్యాంకులు, గోల్డ్‌షాపుల వద్ద తనిఖీలు నిర్వ హించారు.
-డీసీపీ భాస్కర్
మంచిర్యాలక్రైం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణే పోలీసుల లక్ష్యమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శనివారం మంచిర్యాల మార్కెట్ లోని వాణిజ్యసంస్థలు, లాడ్జీలు, బ్యాంకులు, గోల్డ్‌షాపుల వద్ద తనిఖీలు నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘాపెంచేందుకు నాకాబందీ నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మంచిర్యాలలోని వాణిజ్యసంస్థలు, లాడ్జీలు, తదితర ముఖ్యమైనప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనదా రులు వాహనాలకు నంబర్లుప్లేట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నంబర్ ప్లేట్ వంచడం, మార్చడం లేదా నంబర్ ప్లేట్ లేకుండా నడపడం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ర్టేషన్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు, ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.