Mancherial: కోర్టు అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలి
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:48 PM
మంచిర్యాలక్రైం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కోర్టు డ్యూటీఅధికారులు తమ పనితీరును మెరుగుప రుచుకోవడడంతో పాటు శిక్షలశాతం పెంపుపై దృష్టిసారించాలని రామగుండం పోలీసుకమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు.
మంచిర్యాలక్రైం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కోర్టు డ్యూటీఅధికారులు తమ పనితీరును మెరుగుప రుచుకోవడడంతో పాటు శిక్షలశాతం పెంపుపై దృష్టిసారించాలని రామగుండం పోలీసుకమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. శనివారం సీపీ కార్యా లయంలో కాన్ఫరెన్స్ హాల్‌లో కోర్టుడ్యూటీ, కోర్టు లైజనింగ్ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధు లకు సంబంధించిన ప్రతిపనిని నిర్దేశిత గడువులో నాణ్యత తో పూర్తిచేయాలని సూచించారు. విధుల నిర్వహణలో సాంకేతిక సమస్యలను దాచిపెట్టకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావాలన్నారు. వాటి పరిష్కారానికి శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు సమన్లు, బెయిల్ మంజూరు కాని అరెస్టువారెంట్ల అమలు కోర్టుకు సంబంధించిన అన్ని ప్రక్రియలను వేగవంతంగా సమర్థవంతంగా పూర్తి చేయా లని, సాక్షులను కోర్టుకుసకాలంలో హాజరుపరిచే విషయం లో ప్రత్యేకశ్రద్ధ వహించాలన్నారు. సాక్షులకు కోర్టు ప్రక్రి యపై ముందస్తు అవగాహన కల్పించి స్పష్టంగా వాం గ్మూలం ఇచ్చేలా మార్గదర్శకత్వం కల్పించాలన్నారు. ప్రతి కేసులో శిక్షలుపడేలా దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలోప్రతిభ కనబరిచిన అధికారులను ప్రతి నెలా గుర్తించి ప్రోత్సాహబహుమతులు అందిస్తాన్నారు. కమిషనరేట్ పరిధిలో శిక్షల శాతాన్ని పెంచడం ప్రతికేసును సకాలంలో పూర్తిచేయడం ప్రధానలక్ష్యమన్నారు. కార్యక్రమం లో అడిషనల్‌డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్, సీసీఆర్‌బీ ఇన్ స్పెక్టర్‌లు అనిల్‌కుమార్, బాబురావు, ఎస్‌ఐ, కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు.