Mancherial: వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌సరఫరా చేయాలి
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:47 PM
నస్పూర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేయాలని విద్యుత్‌శాఖ వరంగల్(ఆపరేషన్) డైరెక్టర్ టి మఽధుసూదన్ అన్నారు.
నస్పూర్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేయాలని విద్యుత్‌శాఖ వరంగల్(ఆపరేషన్) డైరెక్టర్ టి మఽధుసూదన్ అన్నారు. నస్పూర్ పట్టణం సీసీసీ సింగరేణి అథితిగృహంలో సోమవారం జిల్లాస్థాయి విద్యుత్ అధికారు లతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు, రైతులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. వ్యవసాయ రంగా నికి అవసరమైన విద్యుత్‌కనెక్షన్లు, గృహ అవ సరాలకు సంబంధించిన కనెక్షన్లు దరఖాస్తులు వచ్చిన వెంటనే పరిశీలించి మంజూరు ఇవ్వాలన్నారు. వ్యవసాయరంగా నికి నాణ్యతతో కూడిన విద్యుత్‌ను రైతులకు అందించాలన్నారు. జిల్లాఅధికార యంత్రాం గం కూడా సమష్టిగాకృషి చేయాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే వెళ్లి మరమ్మతులు చేసి త్వరగా పునరుద్దరించాలని సూచించారు. సమావేశం లో వరంగల్ సీఈ బి అశోక్, మంచిర్యాల ఎస్‌ఈ బి రాజన్న, జిల్లాలోని డీఈఈలు, ఏడీఈలు, ఏఈలు, ఎస్‌ఏవోలు, ఏఏవోలు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.