Mancherial: రైతాంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:48 PM
దండేపల్లి ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని మంచిర్యాల మాజీఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు.
మాజీఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
దండేపల్లి ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని మంచిర్యాల మాజీఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం దండే పల్లిలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. అకాల వర్షాలు ముంచుకొచ్చే ప్రమాదం కన్పిస్తున్నా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించ డంలో ప్రభుత్వం అలసత్వం చూపిస్తున్న దన్నారు. గ్రామాల్లో కోనుగోలు కేంద్రాలు ప్రారం భించారే తప్ప ఇప్పటికి వరకు ఒక గింజను కోనుగోలు చేయలేదన్నారు. స్థానికంగా సాగైనా వరి, మొక్కజొన్న ఉత్పత్తులకు అనుగుణంగా తగినన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, సకాంలో వ్యవసాయ ఉత్పత్తులను మిల్లులకు తరలించాలని ఆయన రైతుల పక్షాన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 1క్వింటాల్‌కు 500బోనస్ డబ్బును కూడా సకాలంలో రైతు లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయ వద్దన్నారు. అనంతరం కోనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లకుప్పల వద్దకు వెళ్లి రైతుల సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీవైస్ ఎంపీపీ పసర్తి అనిల్‌కుమార్, మాజీపీఏసీఎస్ వైస్‌చైర్మన్ అక్కల రవిందర్, నాయకులు శ్రీనివాస్, భూమన్న, తిరుపతి, రాజమల్లు, రవి, అజయ్, అఖిల్, హరీష్, రాజన్న, మహేష్,, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.