Mancherial: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలం
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:53 PM
మంచిర్యాల కలెక్టరేట్/బెల్లంపల్లి/చెన్పూరు, సెప్టెం బరు 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రనాయకుడు విజిత్‌రావు అన్నారు.
- జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా, రాస్తారోకో
మంచిర్యాల కలెక్టరేట్/బెల్లంపల్లి/చెన్పూరు, సెప్టెం బరు 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రనాయకుడు విజిత్‌రావు అన్నారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్పూరు పట్టణాలలో వారు వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీఇచ్చిన 420హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాలలో భారీఫ్లెక్సీని ప్రదర్శిం చారు. ర్యాలీలు నిర్వహించారు. అనంతరం నిర్వహిం చినలో ధర్నాలలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 420హామీలను ఇచ్చి అమలు చేయడంలో అబాసు పాలైందన్నారు. అబ ద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి చేసింది శూన్య మన్నారు. కేవలం ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకొని తాత్సారం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రేంసాగర్‌రావు ఎమ్మెల్యేగా గెలిచి మంచిర్యాల నియో జకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి అక్రమార్కుల ఎమ్మెల్యే లిస్టు తీస్తే మొదటిస్థానంలో ప్రేంసాగర్‌రావు నిలుస్తారన్నారు. కాంగ్రెస్‌పార్టీ కళ్యాణలక్ష్మి పేరిట తులం బంగారం హామీలు నిలబెట్టు కోకపోతే ప్రజల సమక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలి పారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి హామీలపై స్పష్టత ఇవ్వ కుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని కాంగ్రెస్‌పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెర వేర్చే వరకు ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌పోరాటం కొనసా గిస్తుందని మాజీఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మంచిర్యాల, నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్యం, అక్కూరి సుబ్బన్న, సత్తార్, పెట్టెం లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, బెల్లంపల్లిలో బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు సత్యనారాయణ, బత్తుల సుదర్శన్, తొంగల సత్యనారా యణ, కౌన్సిలర్లు, నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.