Mancherial: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:51 PM
కోటపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంక టస్వామి అన్నారు.
- మంత్రి వివేక్ వెంకటస్వామి
కోటపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంక టస్వామి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రూ.50లక్షల సింగరేణి సీఎస్‌ఆర్ నిధులతో పలు అభివృద్థి పనులకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. మొదటగా తాను గెలిచిన సమయంలో ఈ స్కూల్ పరిస్థితి దారుణంగా ఉండేదని అన్నారు. దీని రూపురేఖలు మార్చాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ నిధులు కేటాయించాలని స్థానిక నాయకుల కోరిక మేరకు ఆశ్రమ పాఠశాలకు రూ.80లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. చక్కని కిచెన్ డైనింగ్ హాల్ ఏర్పాటు చేశామని, మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణం చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50వేల టీచర్లపోస్టులను భర్తీచేశామన్నారు. సోమనపల్లి గ్రామంలో రూ.250కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే ప్రజలకు అనుకూలంగా వంద పడకల ఆసుపత్రి భవనాన్ని సెప్టెంబరు 4న ప్రారంభిస్తామన్నారు. అనంతరం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ఇంత మారుమూల ప్రాంతంలో మంచి స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. పాఠశాలల్లో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, చెన్నూరు మార్కెట్‌కమిటీ చైర్మన్ మహేష్‌ప్రసాద్ తివారీ, సర్పంచు ఆలూరి సంపత్, తహసీల్దార్ రాఘవేం దర్‌రావు, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, హెచ్‌ఎం మధునయ్య, సర్పంచులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం..
మందమర్రిటౌన్/చెన్నూరు : నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. మందమర్రిటౌన్, చెన్నూరు పట్టణాల్లో ఏర్పాటు చేసిన కాకా ఉచిత కోచింగ్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. ముందుగా తన తండ్రి కాకా వెంకటస్వామి చిత్రపటానికి తనయుడు ఎంపీ వంశీకృష్ణతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. మంత్రి మాట్లాడుతూ చెన్నూరులో, మందమర్రిలో ఉచిత కోచింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో కోచింగ్ తీసుకునే అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నామన్నారు. నిరుద్యోగులు ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో సాధించాలన్నారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో వందమందికి పైగా జర్మనీ భాషపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారన్నారు. వారి ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. అనంతరం కోచింగ్ సెంటర్ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రికి, ఎంపీకి ఆటో డ్రైవర్ల వినతి
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణకు మందమర్రి ఆటో అసోసియేషన్ నాయకులు వినతిపత్రాలు అందించారు. మొయ్య రాంబాబు, రాజులు మాట్లాడుతూ ఈనెల 21నుంచి తాము సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వం ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయిందన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.
చెన్నూరు పట్టణం కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో రూ.1.45కోట్లతో చేపట్టిన రెనోవేషన్ పనులు పూర్తికావడంతో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తును మంత్రి ప్రారంభించారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఫ బతుకమ్మ ఘాట్ నిర్మాణపనులకు శంకుస్థాపన..
మందమర్రిటౌన్ (రామకృష్ణాపూర్): క్యాతనపల్లి మున్సిపాలిటీ 5వ వార్డు అమరవాదిలో బతుకమ్మ ఘాట్ నిర్మాణపనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్రమ క్రమంగా నెరవేరుస్తున్నానన్నారు. వార్డుల్లో సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ మిట్టపల్లి సరిత, వార్డు కౌన్సిలర్ శిరీష, నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, పల్లె రాజు, భీమపాక శిరీష, రమేష్, ప్రభాకర్, పనాస రాజు, అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.