Mancherial: ఫిర్యాదులు పెండింగ్ పెట్టకూడదు
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:00 AM
లక్షెట్టిపేట, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌స్టేష న్‌కు వచ్చే ఫిర్యాదు లను పెండింగ్ పెట్ట కూడదని వెంటవెం టనే పరిష్కరిం చాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గిడిభాస్కర్ అన్నారు.
- మంచిర్యాల డీసీపీ ఎగ్గిడి భాస్కర్
లక్షెట్టిపేట, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌స్టేష న్‌కు వచ్చే ఫిర్యాదు లను పెండింగ్ పెట్ట కూడదని వెంటవెం టనే పరిష్కరిం చాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గిడిభాస్కర్ అన్నారు. బుధవా రం లక్షెట్టిపేట పట్ట ణంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేషన్‌కువచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెదలాలని క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. రోడ్డుప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సైబర్‌నేరాలు, రోడ్డుభద్రత నిబం ధనలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. సివిల్ ఫిర్యాదు లపై రెవెన్యూ అధికారులను సంప్రదించి వారి పూర్తిఅభిప్రాయం తీసు కున్న తర్వాతే తదుపరిచర్యలు చేపట్టాలన్నారు. పోలీస్‌స్టేషన్ పరిస రాలు, సిబ్బంది విధులను పరిశీలించిన డీసీపీ సంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన వెంట లక్షెట్టిపేట సీఐరమణమూర్తి, ఎస్సైగోపతిసురేష్ ఉన్నారు.
జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి
మందమర్రిరూరల్/రామకృష్ణాపూర్ : బొక్కలగుట్ట గ్రామంలో ఈనెల9న జరిగే గాంధారి మైసమ్మ జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలని మంచిర్యాలడీసీపీ భాస్కర్ సూచించారు. బుధవారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గాంధారిమైసమ్మ ఆలయం జాతీ య రహదారిపక్కనే ఉన్నందున ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరకువచ్చే భక్తులకు అన్నిసదు పాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయాశాఖల అధి కారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, మందమర్రి సీఐ రమేష్, కాసిపేట ఎస్‌ఐ ఆంజ నేయులు, ఎస్‌ఐ శ్రీధర్ పాల్గొన్నారు.