Mancherial: పిల్లలకు అన్నిరకాల టీకాలు ఇప్పించాలి
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:50 PM
మంచిర్యాల కలెక్టరేట్/ నస్పూర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వాల్సిన టీకాలను కచ్చితంగా వేయించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు.
- డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
మంచిర్యాల కలెక్టరేట్/ నస్పూర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వాల్సిన టీకాలను కచ్చితంగా వేయించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. నస్పూర్ పట్టణం తాళ్లపల్లి పునరావాస కేంద్రంలోని ఆయుష్మాన్ ఆరోగ్యకేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులు, పరిశీలించి వ్యాధి నిరోధక టీకాలకు హాజరైనా తల్లులతో మాట్లాడారు. టీకాలు ఇచ్చిన వెంటనే ఇంటికి వెళ ్లకుండా అర్ధగంట సేపు ఆరోగ్య కేంద్రంలోనే ఉండాలని సూచించారు. పిల్లలకు ఇచ్చిన టీకాల వివరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు యువిన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పోర్టర్లను ఏ విధంగా ఓపెన్ చేయాలో స్వయంగా ఓపెన్ చేసి చూపించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యూకేటర్ అల్లాడి శ్రీనివాస్, ఏఎన్‌ఎం స్వరూపరాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.