Mancherial: అభ్యర్థులు పట్టుదలతో లక్ష్యసాధనకు కృషిచేయాలి
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:48 PM
మంచిర్యాల కలెక్టరేట్, నవంబర్ 12 (ఆంధ్ర జ్యోతి): పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషితో తమ లక్ష్యా లను సాధించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, నవంబర్ 12 (ఆంధ్ర జ్యోతి): పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషితో తమ లక్ష్యా లను సాధించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కాలేజీరోడ్డులో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ఉద్యోగాల అభ్యర్థులకు నిర్వహిస్తు న్న నిపుణ శిక్షణ కార్యక్రమానికి రామ గుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ భాస్కర్, ఏసీపీ ప్రకాష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణలో పాల్గొంటున్న అభ్య ర్థులలో అధికశాతం మంది ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించే అవకాశంఉందని పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. పరీక్ష పూర్తయ్యే వరకు ఇదే ఉత్సాహం, పట్టుదలతో చదువును కొన సాగించాలని సూచించారు. ప్రిలిమినరీ పరీక్ష అనం తరం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అభ్య ర్థులకు శారీరక దృఢత్వ పరీక్షలకు సంబంధించిన శిక్షణ కూడా అందిస్తామని తెలిపారు. ఫిజికల్ టెస్టులతో పాటు అవసరమైన ప్రాక్టీస్, నైపుణ్యాలను అభివృద్ధి చేసు కోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమానికి సుమా రు 400మంది అభ్యర్థులు క్రమం తప్పకుండా హాజర వుతుండటం అభినందనీయమని తెలిపారు. ఈశిక్షణ ద్వారా క్రమశిక్షణ, సమయపా లన, కష్టపడే తత్వం, సామాజిక బాధ్యతవంటి మంచి లక్షణాలు అలవడ తాయని తెలిపారు. సీపీ మాట్లాడుతూ శిక్షణ ప్రారం భానికి, ఇప్పటికి అభ్యర్థుల ప్రవర్తన, వస్త్రధారణ, సమయ పాలన, క్రమశిక్షణలో గణనీయమైన మార్పు కనిపిస్తోందని తెలిపారు. అభ్యర్థులను చూస్తుంటే ఇప్పటికే పోలీస్, ఆర్మీ నియామకాలకు సిద్ధమైన వారిలా కనిపిస్తున్నారని, వారిక్రమశిక్షణ, అంకిత భావం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించా యని తెలిపారు. కేవలం ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కాకుండా, మెరిట్ జాబితాలో అత్యుత్తమ స్థా నం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. విజయం సాధించే క్రమంలో ఎదుర య్యే ఇబ్బందులను ఆత్మవిశ్వాసంతో అధిగమించాలని తెలిపారు. అభ్యర్థులకు విద్యాబోధనతో పాటు మంచి వ్యక్తిత్వం, నడవడిక, క్రమశిక్షణను నేర్పిస్తున్న రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సంపత్, వారి బృందసభ్యుల కృషి అభినం దనీయమని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా అభ్యర్థులు ఏ రంగంలోకి వెళ్లినా విజయవంతంగా రాణించ గలరని ఆకాంక్షించారు. అనంతరం శిక్షణ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ మెటీరియల్‌ను అందజేశారు. కార్యక్ర మంలో రిజర్వ్‌ఇన్‌స్పెక్టర్ సంపత్,పోలీస్ అధికారులు, శిక్షణ బృంద సభ్యులు, అభ్యర్థులు పాల్గొన్నారు.
వసతుల కల్పనపై
ప్రత్యేక దృష్టిసారించాలి..
మందమర్రి రూరల్ (కాసిపేట) : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. కాసిపేట మండలంలోని ప్రభుత్వపాఠశాలలు, సంక్షేమ హాస్ట ళ్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన గురు వారం పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాల న్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాసిపేట కస్తూర్బాగాంధీ విద్యాలయం, దేవాపూర్ బాలికల ఆశ్రమ పాఠ శాలను సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా చూడాలని అధికా రులకు సూచించారు. సెలవుల తర్వాత పిల్లలందరూ బడికి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం పెద్దాపూర్‌లో నిర్వహిస్తున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. రైతులు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆయన వెంట నాయబ్ తహసీల్దార్ అంజయ్య ఉన్నారు.