Share News

Mancherial: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:52 PM

లక్షెట్టిపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరేందర్‌రాథోడ్‌ ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.

Mancherial:  ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌

లక్షెట్టిపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరేందర్‌రాథోడ్‌ ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలోని ఇటిక్యాల సబ్‌ సెంటర్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. సబ్‌సెంటర్‌లోని పలు రికార్డులతోపాటు ప్రజ లకు సిబ్బంది అందజేస్తున్న వైద్యసదుపా యాలను, వ్యాక్సినేషన్‌ వివరాలను అడిగి తెలసుకున్నారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లా డుతూ ప్రతీఆశాకార్యకర్త ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్‌ వేయించాలన్నారు. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలు యూవిక్‌ పోర్టల్‌లో వ్యాక్సినేషన్‌ వివరాలు నమోదు చేయాలని అన్నారు. అదేవిధంగా క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి వైద్యపరీక్షలు నిర్వ హించడంతో పాటు సక్రమంగా మందులు వాడేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మిడిల్‌ లెవల్‌ హెల్త్‌ప్రొవైడర్‌ మౌనిక, ఆరోగ్యకార్యకర్త విజయదర్శిని, జిల్లా మాస్‌మీడియా అధికారి వెంకటేశ్వర్లు, సీహెచ్‌వో నామదేవ్‌, హెల్త్‌ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 11:52 PM