Mancherial: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:00 AM
భీమిని, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
భీమిని, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. బుధ వారం మండలకేంద్రంలోని కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి నూతనంగా నిర్మిస్తున్న అద నపు తరగతిగదులను, భోజనశాల నిర్మాణపుపనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణపనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూముల రీసర్వేలో వేగం పెంచాలని సూచించారు. అనంతరం మల్లీడి గ్రామంలో నూత నంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. మల్లీడి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవా లన్నారు. అదేగ్రామంలో నూతనంగా నిర్మించే వీవో భవన నిర్మాణపనులను కొబ్బరికాయకొట్టి ప్రారంభిం చారు. మహిళాసంఘాల కార్యక్రమాలకు అవసరమైన వసతులు కల్పించేలా నిర్మాణ పనులు చేపట్టాలని నాణ్యతతో చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బికర్ణదాస్, ఎంపీడీవో రమేష్, ఎంఈవో వెంకటస్వామి, కేజీ బీవీ ప్రత్యేకాధికారి పుప్పాల దివ్వ, మల్లీడి సర్పంచ్ కర్నె మమత శ్రీనివాస్, ఎంపీవో అక్తర్మోహినుద్దీన్, ఉపసర్పం చ్ పత్తిపాకపావని జగదీష్, ఆయాగ్రామాల కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.
కన్నెపల్లిలో
పర్యటించిన కలెక్టర్
కన్నెపల్లి : మండల కేంద్రంలో బుధవారం కలెక్టర్ కుమార్‌దీపక్ పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రా న్ని సందర్శించి వైద్యసేవల నిర్వహణను పరిశీలించా రు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సంద ర్శించి ప్రహరీ నిర్మాణపనులు, పూర్తయిన భోజనశా లను పరిశీలించారు. వంటశాలలో ఆహారాన్ని పరిశీ లించి విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. వాటర్ ప్లాంట్ ను బాగుచేయించాలని అధికారులకు సూచించారు. అనంతరం రైతువేదికలో వీబీజీరామ్‌జీ శిక్షణ కార్యక్ర మానికి హాజరై శిక్షణ కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించి పలుసూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.