Share News

Mancherial: విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:11 AM

జైపూర్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు.

Mancherial:  విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

జైపూర్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. బుధవారం జైపూర్‌లోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీచేశారు. పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది విధుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌ పరిధిలో తరుచుగా నమోదవుతున్న నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఎస్‌ఐ భూమేష్‌ను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీట్‌లో ఉన్న వ్యక్తులు, ఇతర నేరస్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్‌ మేనేజ్‌ మెంట్‌ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. స్టేషన్‌లో విధులు నిర్వహించే ప్రతి అధికారి, సిబ్బందికి సీసీటీఎన్‌ఎస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలకు, వ్యాపారులకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరుగు తున్న నేపథ్యంలో బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి సంబంధిత శాఖల సమన్వ యంతో హెచ్చరిక బోర్డులను, రహదారి సూచికలు, రంబుల్‌ స్ర్టిప్స్‌ ఏర్పాటు చేయించాలన్నారు. సీపీ వెంట జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 12:11 AM